ఏపీపీఎస్సీ పరీక్షలకు వేళయరా..!!! పూర్తి వివరాలు ఇదిగో..!!!
ఎప్పుడప్పుడా అని ఎదురుస్తున్న ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఎట్టకేకలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) పరీక్ష తేదీలను విడుదల చేసింది. వీటికి సంబంధించిన అన్ని నోటిఫ్కేషన్లను విడుదల చేసిన చాల నెలల తర్వాత కానీ ఇప్పుడు ఈ తేదీలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ లో వివిధ నియామక పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) డిసెంబరు 20 వ తేదీన ప్రకటించింది. వీటిలో గతంలో ప్రకటించిన విధంగా వివిధ మెయిన్ పరీక్షల తేదీలు మారగా, మరికొన్ని పరీక్షలకు సంబంధించిన తాజా తేదీలను కమిషన్ ఖరారు చేయడం జరిగింది.
వీటిలో ముఖ్యంగా గ్రూప్-1 మెయిన్ పరీక్షలతో పాటు, జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, డీఏవో, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ మెయిన్ పరీక్షలు కూడా ఇందులో ఉన్నాయి.
ఇక పూర్తి వివరాలకై వస్తే మార్చిలో నిర్వహించనున్న పరీక్షల వివరాల్లోకి వెళితే.. పాలిటెక్నికల్ లెక్చరర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్స్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్), టెక్నికల్ అసిస్టెంట్స్ (హైడ్రాలజీ), వెల్ఫేర్ ఆర్గనైజర్, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ఉదోగులకు సంబంధించి పరీక్షలు జగనున్నాయి.
ఇక ఏప్రిల్ లో నిర్వహించనున్న పరీక్షల విషయానికి వస్తే.. అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, టెక్నికల్ అసిస్టెంట్, రాయల్టీ ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ (టౌన్‌ప్లానింగ్), అసిస్టెంట్ కెమిస్ట్, టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ పరీక్షలు జగనున్నాయి. కావున ఎవరైతే ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్నారో వారికీ సంబంధించిన పరీక్ష తేదీలను చూసుకోవచ్చు. మరి ఎందుకు ఆలస్యం, ఎక్కువ లేదు, చదవడం మొదలు పెట్టేయండి... ఉద్యోగం కొట్టేయండి. ఆల్ ది బెస్ట్.